లాజిస్టిక్స్ ఖర్చు దేశం యొక్క తయారీ రంగం, ఎగుమతి పోటీతత్వం, ప్రపంచ స్థానాలపై తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉంది. చాలా షిప్పింగ్ కంపెనీలకు ఎర్ర సముద్రం మార్గం వేగవంతం చేసింది. ముంబై, .ఏ.ఎన్.పీ.టీ. వంటి ప్రధాన భారతీయ ఓడరేవుల నుండి సరుకులను రవాణా చేసే నౌకలు సూయజ్ కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రంలోకి నావిగేట్ చేసి వాటి గమ్యస్థానాలను బట్టి వివిధ ఐరోపా నౌకాశ్రయాలను చేరుకుంటాయి.
వాణిజ్యం, ఇంధన దిగుమతుల కోసం, అంతరాయాల కారణంగా భారతదేశం ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. ఇక్కడి ఎగుమతిదారులు ఇప్పుడు తమ వాణిజ్య మార్గాలను వైవిధ్యపరచవలసి ఉంటుంది. ఎర్ర సముద్రంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభించినందున, ఇది అధిక బీమా రేట్లు, ఎగుమతిదారులకు ఎక్కువ ప్రయాణ సమయం ఏర్పడింది. దీనితో ఎం.ఎస్.ఎం.ఈ. ఎగుమతులను కాపాడాలని షిప్పింగ్ కంపెనీల ప్రభుత్విన్ని కోరుతున్నాయి.

