అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టినా రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది అర్షన్ అహ్మద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి సులేమాన్ రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ తెలిపాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా అబుబకర్, ఖాదర్ బాషా అనే వ్యక్తుల పేర్ల మీద రెవిన్యూ అధికారులు ఎక్కించరని అవేదన వ్యక్తంచేసాడు.
రాయచోటి మండల పరిధిలోని గునిగుంట్ల రోడ్డు సర్వే నెంబర్ 800 లో గతం 30 సంవత్సరాల నుంచి తన తండ్రి అయిన సులేమాన్ పేరు మీద 75 సెంట్ల స్థలం ఉందని బాధితుడు తెలిపాడు. ఎన్ని సార్లు స్పందన అర్జీలు పెట్టిన అర్.ఐ., వీఆర్వో, డిప్యూటీ ఎమ్మార్వో న్యాయం చేయకుండా తమ చుట్టు తిప్పుతున్నారని అన్నాడు. సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మేల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.
