ఎంఎస్‌ఎన్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నాచోరే డాన్స్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. సూర్య కళామందిర్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒకరికి ఒకరు పోటీగా క్లాసికల్, జానపద, చిత్ర రంగానికి సంబంధించిన సన్నివేశాల పాటలతో ఆహుతులను ఉర్రూ తలూగించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నిత్యం చదువుతో సతమతమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు నాచారే వంటి డాన్స్ పోటీలు ద్వారా పిల్లలు ఉత్తేజాన్ని నింపుకోవచ్చు అన్నారు. ఆ దిశగా ఎమ్మెస్ అండ్ విద్యాసంస్థల అధినేత విజయ్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
ఉర్రూతలూగించేశారు…

