Kakinada

ఉపాధి హామీ పథకం క్రింద ప్రత్యేక నిధులు విడుదల.. -హోంమంత్రి-

WhatsApp Image 2023-12-06 at 9.13.29 PM

కొవ్వూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్.) క్రింద మండలానికి 5 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్. నిధులను కేటాయించాలని సీ.ఎం. దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు.
జగనన్న ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు నడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోందన్నారని చెప్పారు. మండలానికి 5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల్లో ప్రతిపాదించిన పనులకు ఆమోదం అనంతరం పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ