తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ అభ్యర్థులకు ఉద్యోగయోపరిమితి 44 సంవత్సరాల నుండి 46 కు పెంచింది, మరొక ఐదు సంవత్సరాలు కలిపి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. లకు 51 కి చేరింది. అదే విదంగా ఏ.పీ. నిరుద్యోగులు గత ప్రభుత్వ కాలం నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువ ఖాళీలతో విడుదల చేయడం జరుగుతుందని అందువల్ల ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచమని వేడుకుంటున్న విషయం తెలిసిందే.
డీఎస్సీ పరిక్షకు టెట్ పరిక్షకు మధ్య కనీసం నెల రోజులు వ్యవధి చదువుకోవడానికి ఉండాలని ఏ.పీ. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు జరిగి టెట్ ఫలితాలు 14 మార్చిన వస్తే మార్చి 15 న డీఎస్సీ పరీక్ష ఎలాగా నిర్వహిస్తారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
వీటన్నిటికీ కనీసం నెల రోజుల నుండి 45 రోజులు గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు 47 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్ సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

