డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అయినవిల్లి మండల ఈ.వో. సత్యనారాయణ రాజు కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయనకు ఏ.సీ. గా ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులును హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఇచ్చిన ప్రమోషన్ల ఉత్తర్వులపై హైకోర్టు ఆర్డర్ తో కమిషనర్ అర్ధరాత్రి వాట్సాప్ లో ఇచ్చిన ఆదేశాలుతో అతని మెడకు హైకోర్టు కేసు చుట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. మురమళ్ళ ఆలయ ఈ.వో. లక్ష్మీనారాయణ పై వేసిన రిట్ పిటిషన్ వల్లే సత్యనారాయణ రాజు కు ఇచ్చిన ఉత్తర్వులుతో హైకోర్టు సస్పెన్షన్ విధిస్తూ తీర్పుచెప్పింది.
ఈ.వో. సత్యనారాయణ పదోన్నతిపై హైకోర్టు వేటు…

