ఆంద్ర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నకల దృష్యా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈ.వీ.ఎం., వీ.వీ. ప్యాట్ గోదామును కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ అధికారులు, ఎన్నికల అధికారులు, అగ్నిమాపక శాఖల అధికారులు, తదితరులతో కలిసి తనీఖి చేశారు. ఈ.వీ.ఎం.ల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డా. కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ.వీ.ఎం. ల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ… భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈ.వీ.ఎం., వీ.వీ. ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ.వీ.ఎం.ల భద్రతా చర్యలను సందర్శంచిన జిల్లా కలెక్టర్…

