Gujarat

ఇద్దరు అభ్యర్థులు పోటీకి నో చెప్పడంతో ఆందోళనలో గుజరాత్ బీ.జే.పీ. …

OIF (5)

గుజరాత్‌లోని వడోదర, సబర్‌కాంత లోక్‌సభ స్థానాలకు చెందిన బీ.జే.పీ. అభ్యర్థులు శనివారం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని వ్యక్తిగత కారణాలను చూపి అధికార పార్టీలో విభేదాలు తెరపైకి తెచ్చారు. వడోదర నుంచి బీ.జే.పీ. ఎం.పీ. గా ఉన్న రంజన్‌బెన్ భట్ మూడోసారి టిక్కెట్టు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు నిరాకరించారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె తన నిర్ణయాన్ని బయటపెట్టింది.

సబర్‌కాంత బీ.జే.పీ. అభ్యర్థి భికాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. భట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినందుకు బీ.జే.పీ. మహిళా మోర్చా మాజీ జాతీయ ఉపాధ్యక్షురాలు జ్యోతి పాండ్య సస్పెండ్ అయిన కొద్దిసేపటికే, వడోదర ఎం.పి. వ్యక్తిగత కారణాలు చూపి లోక్‌సభ ఎన్నికల రేసు నుండి వైదొలిగారు. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌ల ద్వారా.. పోటీ చేయడానికి తాను సద్ధంగాలేదనే విషయాన్ని పార్టీకి తెలియజేసినట్లు భట్ తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Modi-haa_d
Gujarat

గుజరాత్‌లో బీ.జే.పీ. కి ఎదురుదెబ్బ… 1.25 శాతం తగ్గిన ఓట్లు…

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం 1.25 శాతం పడిపోయింది. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం… 2019లో