దేశాన్ని మతాలు, కులాల పేరుతో ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలో ఉన్న బీ.జే.పీ. ప్రభుత్వం దాని కూటమి టీ.డీ.పీ., జససేన, నిరంకుశ వై.సీ.పీ. లను ఓడించి, దేశ రక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపు నిచ్చారు. కాకినాడలో స్థానిక కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థి ఎం. పల్లంరాజు కు ప్రకటించిన సందర్భంగా సీ.పీ.ఐ. జిల్లా నాయకత్వం ఆయనను కలిసి అభినందనలు తెలియ జేసింది. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… మతోన్మాద బీ.జే.పీ. రాజకీయ చదరంగంలో వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు పాములేనని వాటికి తగిన గుణపాఠం చెప్పాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని మధు పిలుపునిచ్చారు.
కేంద్రంలో బీ.జే.పీ. ప్రభుత్వం ఎన్నికల బాండ్ల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండే దానికోసం ప్రతిపక్ష నాయకులను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిరంకుశత్వంతో అరెస్టు చేస్తుందని విమర్శించారు. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ వనరులన్నింటిని కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మివేస్తూన్నారని తెలిపారు. ఈ సమావేశములో సీ.పీ.ఐ. జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ , కార్యవర్గ సభ్యులు పి. సత్యనారాయణ , కాంగ్రెస్ నాయకులు ఎం. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

