ఆస్తివిలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్ట పోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మెయిన్ రోడ్ లో చదరపు గజం భూమి ప్రభుత్వ రిజిస్ట్రే షన్ ధర రు. 95 వేలు వుండగా అదే ధరను మెయిన్ రోడ్ ను ఆనుకుని వెనుకవైపు వున్న వీధుల్లో కూడా అదే ధర నిర్ణయం చేయడం వలన ఆస్తి పన్ను విధింపు దారుణంగా తయారయ్యిందన్నారు.
వంద అడుగుల వెడల్పు వున్న ప్రధాన రహదారిగా వున్న మెయిన్ రోడ్డుకు 40 అడుగులు వెడల్పు వున్న చిన్నపాటివీధి రోడ్లకు ఒకే ధర నిర్ణయించడం తగదన్నారు. టూ-టౌన్ నుండి జగన్నాధపురం వంతెన వరకు రెండు వైపులా వున్న సూర్యారావుపేట లోని మాదిరెడ్డి వారి వీధి, లచ్చిరాజు వారి వీధి, మునసబు గారి వీధి, దంటువారి వీధి, తటవర్తి వారి వీధి, సాలిపేట లోని కాసిం వీధి, తదితర ప్రాంతాల్లో కూడా మెయిన్ రోడ్ భూమికి చెందిన రిజిస్ట్రేషన్ ధర విధించడం తగదన్నారు.

