ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ వ్రాతపరీక్షలు ప్రధమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మార్చి ఒకటో తేదీ నుండి 20వ తేదీ వరకు ఒక ప్రణాళిక సమన్వయంతో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యలయంలో డి.ఆర్.ఓ. చాoబర్ నందు ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పరీక్షల నిర్వహణ ముందస్తు ఏర్పాటుచేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశ్నాపత్రాల భద్రత, తరలింపు అంశంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చరు. పరీక్ష కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా కళాశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు నిర్వహణ అనంతరం జవాబు పత్రాలు తరలింపులో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారo లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

