జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరీ యాత్రలో భాగంగా ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో సభ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గోనున్నట్లు వెళ్లడించారు. 9వ తేదీన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. తీవ్రమైన జ్వరం కారణంగా వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. కోలుకున్న ఆయన 7వ తేదీ నుంచి యధావిధిగా ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేయనున్నట్లు సమాచారం.
ఆ ప్రాతాంల్లో 7, 8వ తేదీల్లో పవన్ కళ్యాణ్ సభలు…

