తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రామాదం జరిగింది. స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఉన్న ఆల్విన్ ఫార్మ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బిల్డింగ్ మొత్తం ఆ మంటలు చేరాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది భయపడి ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక నించేన సాయంతో కిటికీ ద్వారా బయటికి దిగుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సివుందని అధికారులు తెలిపారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…
