Political

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం… పినిపే విశ్వరూప్

1000040901

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురం రూరల్ చిందాడ గారువు లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. విశ్వరూప్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించి కార్యక్రమాల నిర్వహణ తీరును అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. జగనన్న విద్య వైద్యానికి పెద్దపీట వేశారని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు వచ్చే పేదలకు వైద్యులు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టరు కాన్సెప్ట్ అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఇంటికే వచ్చి బీ.పి. , షుగర్, మలేరియా, డెంగ్యూ వంటి 7 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకంతో శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య శిబిరానికి వచ్చిన వారితో మంత్రి ముఖాముఖి మాట్లాడారు. కంటి పరీక్షలు చేస్తున్న వారి వద్దనే ఉండి వారికి మందులను అందజేశారు.

జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫుడ్ ‘స్టాల్స్ మంత్రివర్యులు సందర్శించా రు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి సూపర్వైజర్ మంత్రికి వివరించారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో అక్కడున్న ప్రతి ఒక్కరికి అవగా హన కల్పించాలన్నారు.. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఏ ఎన్ ఏం ‘లు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.