Political

ఆప్ నేతల మధ్య తీవ్రస్థాయికి చేరుకున్న మాటల యుద్ధం…

OIP (30)

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా అధికార ఆప్ నేతల మధ్య శుక్రవారం అర్థరాత్రి తీవ్రస్థాయి మాటల యుద్ధం జరిగింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు శనివారం ఓటింగ్ జరుగుతున్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు, పోలింగ్ ప్రక్రియను దెబ్బతీసేందుకు ఒకరి ప్రణాళిక మరొకరు ఆరోపిస్తున్నారు. ఆప్ మంత్రి అతిషి మాట్లాడుతూ… ఈరోజు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీసులను ఆయా ప్రాంతాల్లో ఓటింగ్‌ను మందగించాలని ఆదేశించినట్లు సమాచారం అందిందని అన్నారు.

పెద్ద సంఖ్యలో ఇండియా బ్లాక్ ఓటర్లు ఉన్న చోట ప్రజలు తమ ఓటు వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. బీ.జే.పీ. ని గెలిపించేందుకు ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నమైనా చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం మరియు రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ఎన్నికల సంఘం దీనిని పరిగణలోకి తీసుకుంటుందని, అలాంటి ప్రయత్నాలను ఆపుతుందని నేను ఆశిస్తున్నానన్నారు. దీనిపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.