సమాజంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాధారణకు గురైన కుటుంబ సభ్యులకు, దివ్యాంగులకు, ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తాజాగా వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు స్పీచ్ తెరపి యంత్రాలను అందజేసి భవితకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అభాగ్యులకు బాసటగా నిలుస్తూ వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ భాగస్వాముల సేవలు అభినందనీయం అన్నారు.
ఆపదలో చేయూత…

