సేవ్ ద పీపల్ ఆర్గనేజేషన్ ప్రతినిధులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులను సమకూర్చి ఉదారతను చాటుకున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి సుమారు 15 ఏళ్ల క్రితం కూలి పనులకు వలస వచ్చి అనారోగ్యం భారినపడిన నిరుపేద పార్వతి రాయ్ కుటుంభానికి ప్రతినెల ఈ ఆర్గనేజేషన్ బియ్యం, కిరాణా, మందులు సమకూర్చుతున్నారు.
2024 జనవరి నెలకు ఆర్గనేజేషన్ మెంబర్ హేన నిత్యవసర వస్తువులను సమకూర్చారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సుంకర సుదీర్ సమక్షంలో వాటిని నిరుపేద కుటుంభానికి అందజేశారు. ఈ సందర్భంగా పార్వతి రాయ్ మాట్లాడుతూ… ప్రతి నెల దేవుడిలా తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను సమకూర్చుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

