అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుందని జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి అన్నారు. జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ గా భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి లో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అయ్యాయన్నారు. వాటిలో భాగంగానే కార్ధియో తోరాసిస్ , అంకాలజీ సర్జరీ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రారంభమయ్యాయన్నారు.
అంతే కాకుండా కీలకమైన విభాగాలకు నిపుణులైన వైద్యులను సైతం నియామకం చేయించేందుకు గాను డా. లావణ్య కుమారి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై రాజీలేని ఒత్తిడి తెచ్చిన ఘనత ఆమిదేనని పలువురు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కాకినాడ జి.జి.హెచ్. లో ప్రధమంగా ఆంకాలజీ సర్జరీ విభాగాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఆర్.ఎమ్.ఓ. డాక్టర్ పుష్కర రావు, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, నర్సింగ్ సూపర్ ఇండెంట్ ఎన్. సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

