రాష్ట్రంలో రవాణా రంగంలో ఆటోలు కీలకపాత్ర వహిస్తున్నాయిని ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారని వారందరరకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏ.ఐ.టి.యు.సీ. వుమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు , ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఉద్రజవరం మండలం వడ్లూరు లో శ్రీ రాంమాజేనేయ ఆటో వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం ఆధ్వర్యంలో నూతన శాఖ ఏర్పడింది . ఏ.ఐ.టి.యు.సి. పతకాన్ని తాటిపాక మధు ఆవిష్కరించారు . యూనియన్ బోర్డు ను పి.ఎస్. నారాయణ , గ్రామ సర్పంచ్ రాకుమండా శ్రునివాస్ , ఉప సర్పంచ్ కటారి సిద్దార్ద్ రాజ్ ఎంపీటీసీ రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు .
ముందుగా మధు పీ.ఎస్. నారాయణ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో పంటలు లేక పట్టణాలకు వలస వచ్చి కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు .ఆర్టీసీ తర్వాత అతి పెద్ద రంగము ఆటోరంగమని వారన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు.
అదేవిధంగా ఆటో కార్మికుల పైన అధిక జరిమానాలు విధించడం రద్దు చేస్తానని మరియు ఆటో కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు చెల్లిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు

