మంత్రి బొత్స ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లకు న్యాయం చేయాలి మంత్రిని కోరామని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లుగా గత పది సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న సిబ్బందికి 28 రోజుల ఉద్యోగ దినాలకు అనుమతించి దాని ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించమని కోరినట్లు తెలిపారు. గతంలో వారికిచ్చన ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ అధ్యక్షులు అచ్చిబాబు, ప్రెసిడెంట్ కాశీ, సెక్రటరీ ఎల్లపు శ్రీను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ లో లేబర్లకు న్యాయం చేయాలి…

