డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామం వద్ద ఆందోళన పేరుతో వేదాంత కంపెనీకు చెందినటువంటి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకొని, వారి ఉద్యోగులను విధి నిర్వహణలకు వెళ్ళనివ్వకుండా నిరోధించినందుకు గాను, మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను సంబంధిత ఆందోళనకారులపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అందర్నీ గుర్తించడం జరుగుతుంది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ P. వీరబాబు నేతృత్వంలో ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. K.M. జోషి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళనకారులపై ఉప్పలగుప్పం పోలీసులు చర్యలు…
