Political

అరాచక పాలన పై పోరాటమే జనసేన, టీడీపీ లక్ష్యం…

1000040904

అరాచక పాలన పోరాటమే లక్ష్యం గా తెలుగుదేశం, జనసేన పార్టీ లు కలిసి పోరాటం చేస్తున్నట్లు తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జనసేన టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక హోటల్ లో జనసేన పార్టీ తరపున కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, టీడీపీ తరపున జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సీటీ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టు కు ముందే జనసేన, టీడీపీ కలిసి అరాచక పాలన పై పోరాటం చేస్తామని చెప్పామని ఈ లోగా చంద్రబాబు ని అక్రమ నిర్బంధం చేశారని వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారి నిర్ణయం ప్రకటించి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా జనసేన, టీడీపీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ అధ్యక్షులు లోకేష్ రాజమహేంద్రవరం లో మొదటి సమావేశం నిర్వహించారని ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న రెండు పార్టీల నాయకులు కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించాలని దానికి అనుగుణంగా ఈ నెల 29 ఆదివారం రోజున కాకినాడ వేదికగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీటీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, జనసేన నాయకులు తలాటం సత్య, తదితరులు ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.