అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో ఎం.ఎస్. చేస్తున్న 24 ఏళ్ల హారిక అనే యువతి మృతి చెందింది. వర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఒక బైకర్ స్కిడ్ అయ్యి కిందపడటంతో ఆ కారు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అమెరికా లో ఘోర రోడ్డు ప్రమాదం… మరో తెలుగు యువతి మృతి…
