Exclusive

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేష ద్వారా సేవలు మరింత విస్తృతం…

1000026531

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్త ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాలను స్కాలర్షిప్లను అందజేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఆప్త ఆధ్వర్యంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులు బట్టి ఉపకార వేతనాలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ కళాశాల చైర్మన్ పోతుల విశ్వం శ్రీమహావిష్ణు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిభ ఉన్న విద్యార్థి పేదరికం అనే అడ్డంకి ద్వారా చదువుకు దూరమవ్వకూడదనే నినాదంతో ఆప్త ఏర్పాటు కావడం ఆనందకరమన్నారు. చదువులోనూ రాణించిన విద్యార్థులు వారు ఉన్నత స్థానానికి వెళ్ళినా తర్వాత తిరిగి ఆప్తకు సహకారం అందించి మరింత మంది విద్యార్థులకు ప్రోత్సాహకారానికి తోడ్పడాలని కోరారు. విద్య సమాజంలో మార్పునకు ముఖ్య కారణమని దీని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.

ఆప్త ప్రతినిధులు వెంకట్ సాన, శ్రీధర్ ఆకుల, సానా నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఆప్త 2018లో ఏర్పాటు చేసి ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించి వారికి ఉపకార వేతనంలతో పాటు వివిధ రకాల లో సేవలు అందిస్తున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్ సానా, అడ్డాల సత్యనారాయణ, సుంకర సుమ, జి.ఎస్. మూర్తిలతో పాటు సుంకర ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, తదితరులు హాజరయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.