ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమెండ్ చేసింది. ఈ విషయంపై సభలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శశి పంజా, కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటనకు ప్రధాని, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఈ విషయంపై పీ.ఎం. మోడీ ఎటువంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు.
అమిత్ షా రాజీనామా చేయాలి… -కాంగ్రెస్ పార్టీ-

