వై.సీ.పీ. అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని జనసేన, టీ.డీ.పీ., బీ.జేపీ. రాష్ట్ర మహిళా నేతలు విమర్శించారు . శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, ఏపీ డ్వాక్రా, అంగన్వాడి సంఘాల అధ్యకురాలు, టీ.డీ.పీ. మహిళా నేత ఆచంట సునీత, బీ.జేపీ. రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులైన మహిళల్ని మోసగించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేశారని, అమలు సాధ్యం కానీ అసత్య హామీలతో ప్రజల్ని మోసగించారని ఆమె అన్నారు. మద్య నిషేధం పేరుతో మహిళల ఓట్లు దండుకొని ఆయన అధికారం చేజిక్కించుకున్నారని మండి పడ్డారు.

