తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీకి దక్కుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అధికార వైకాపా పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని కరప మండలం ఉప్పలంక మత్స్యకారణ నాయకులు సంగాడి బాల మహేశ్వరరావు హితువు పలికారు. ఐక్యతకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైకాపా పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విభూతం కలిగే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.2019 ఎన్నికల తరువాత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో అరాచకాలు ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా బాల మహేశ్వరరావు తెలిపారు.

