అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లాలో కాకినాడ గాంధీ భవన్ లొ సమావేశాన్ని కొల్లేటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతి రావు, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి. తిరుపతి రావు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 19.52 లక్షల మంది ఖాతాదారుల నుండి 3950 కోట్లు వసూలు చేయడం జరిగిందని, కంపెనీ వారు సంస్థ మూత వేసే నాటికి వారి ఆస్తి మన సి.ఐ.డి. వారి లెక్కల ప్రకారం కొన్ని కార్లు, 7 లక్షల నగదు, సుమారుగా 16 వేల ఎకరాల కొన్ని కమర్షియల్ స్థలాలు మాత్రమే జప్తు కాపడ్డాయని, మిగిలిన ఆస్తులు ప్రశ్నార్థంగా మిగిలినవి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. సి.పి.ఐ. జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే. పాల్, వై. కే .రాజు, బొమ్మిటి రాంబాబు, ఏ.చంద్రశేఖర్, భాగ్యరాజు, తదితరులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి…

