కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప గ్రామములోని ఒక్క ఇంటి నందు బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం పై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేశారు. ఆ తనికీల్లో 24 బ్యాగ్ లలో సుమారు 1006 కేజీల PDS బియ్యంను గుర్తించారు. సదరు పి.డి.ఎస్ బియ్యం గోట ధర్మరాజు కి చెందిందని గుర్తించారు. గోట ధర్మరాజు టూవీలర్ వాహనముపై 50 కేజీల PDS బియ్యాన్ని రవాణా చేయుచున్నట్లు తెలిపారు.
PDS బియ్యాన్ని కీలో రూ. 18 /- లకు కొనుగోలు చేసి రూ. 20/- లకు ఉప్పాడ లోని మత్స్యకారులకు విక్రయిస్తున్నారనీ సంభందిత అధికారులు తెలిపారు.. అతను బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేనందున సివిల్ సప్లయ్స్ అధికారులు, యు. కొత్తపల్లి వారు సుమారు రూ 80,240/- లు విలువ గల సుమారు 1006 కేజీల పి.డి.ఎస్ బియ్యంను సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, PDS బియ్యాన్ని అక్రమ నిల్వ చేసిన గోట ధర్మరాజు పై క్రిమినల్ కేసు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది. ఈ తనిఖిలలో కార్యాలయ సబ్-ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్ లోవకుమార్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.

