డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించిన యెడల అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యాప్తికి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. మంత్రి సవరప్పాలెం, వన్నె చింతలపూడి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా సవరప్పాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులైన రూ. 40 లక్షల వ్య యంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభిం చారు.
అనంతరం వన్నె చింతలపూడి గ్రామంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ.40 లక్షలు వ్యయంతో నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి జగనన్న విద్యా దీవెన , వసతి దీవెన, అమ్మ ఒడి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన బైజుస్ టాప్ లు పంపిణీ వంటి కార్యాక్రమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. కుడిపూడి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంగేటి డోలమణి రుద్ర, తదితరులు పాల్గొన్నారు.

