ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి యానాం ప్రాంతం లోని వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు కార్మికులకు మే 13న వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ.. యానం ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్ మౌనిసామి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 13న జరిగే లోక్ సభ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆయన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B ప్రకారం.. యానాం ప్రాంతంలోని వాణిజ్య పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందిగా ఆయా సంస్థల యాజమాన్యాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తూచా తప్పకుండా యాజమాన్యాలు అమలు చేయాలన్నారు.
అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి…

