గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాబోయే ఇండో-యూ.ఎస్. మిషన్‌లో ప్రయాణించడానికి ఎంపికైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి యాక్సియమ్-4 మిషన్ కోసం తమ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, USAలోని ఆక్సియం స్పేస్ ఇంక్‌తో అంతరిక్ష విమాన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇస్రో తెలిపింది. దీని కోసం నేషనల్ మిషన్ అసైన్మెంట్ బోర్డ్ ఈ మిషన్ కోసం ఇద్దరు గగనయాత్రిలను ప్రైమ్ మరియు బ్యాకప్ మిషన్ పైలట్‌గా సిఫార్సు చేసింది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రైమ్ గా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ బ్యాకప్ గా ఎంపికయ్యారు.
అంతరిక్ష కేంద్రానికి మిషన్ కోసం ప్రైమ్, బ్యాకప్ గా ఇద్దరు ఎంప్పిక…

