Exclusive

రాహుల్ గాంధీ రిజర్వేషన్ ట్వీట్‌ పై అమిత్ షా వ్యాఖ్యలు…

facebook_amit-shah_r_071319065937

దళితులు, వెనుకబడిన తరగతులు మరియు గిరిజనుల రిజర్వేషన్లను బీ.జే.పీ. లాక్కోవాలని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను తిప్పికొడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నిరాధారమైన అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

10 ఏళ్లుగా ఈ దేశంలో బీ.జే.పీ. ప్రభుత్వం నడుస్తోంది, రెండుసార్లు పూర్తి మెజారిటీ వచ్చిందన్నారు. రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశ్యం బీ.జే.పీ. కి ఉంటే ఈ పాటికి జరిగి ఉండేదని నొక్కి చెప్పారు. దేశంలోని దళిత, వెనుకబడిన, ఆదివాసీ సోదర సోదరీమణులకు బీ.జే.పీ. ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని నరేంద్ర మోదీ జీ హామీ ఇచ్చారని చెప్పారు.

ఎస్సీ/ఎస్టీ, ఓ.బీ.సీ. ల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దాడి చేస్తూనే వుందని మండి పడ్డారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం వచ్చి 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. వెనుకబడిన సమాజాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చిందని, గిరిజనులకు న్యాయం చేసేందుకు ఏనాడూ కృషి చేయలేదని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.