Exclusive

అంగన్వాడీల సమస్యల పరిష్కరాలపై సీఎంని ముట్టిడిస్తాం…

WhatsApp Image 2023-12-28 at 3.25.48 PM

రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 17రోజులనుంచి సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షరహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఖండిస్తూ యు. కొత్తపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయం దగ్గర అంగనవాడి వర్కర్స్ చేపట్టిన 17 రోజులు సమ్మెకు ఏఐటీయూసీగా నాయకులు సాకా రామకృష్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ … జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో ఇచ్చిన హామీనే నెరవేర్చమని, 17 రోజులపాటు సమ్మె బాట పట్టిన సమస్యలను పట్టించుకోవడంలేదని, కనీసం మా డిమాండ్స్ పై స్పందించడం లేదని, ప్రజా ప్రతినిధులు మాట్లాడాలని అన్నారు. తమ డిమాండ్స్ పరిష్కరించకపోతే జనవరి 3న కాకినాడకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడికు జిల్లాలో ఉన్న అన్ని సెంటర్లు అంగన్వాడి కేంద్రాల టీచర్లు, ఆయాలు జనవరి 3 తేదీన చలో కాకినాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.